సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హాస్పిట‌ల్‌లో చేరిక‌.. త‌ర్వాత ఏంటీ..

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అనారోగ్యం బారిన ప‌డ్డారు. తీవ్ర అస్వస్థతకు గురై అపోలో హాస్పిట‌ల్‌లో చేరారు. రజినీ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నగరంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు.

కాగా ఆయ‌న హైబీపీ స‌మ‌స్య‌తో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌గా తేలింది. పూర్తి సమాచారం త్వరలో వెలువడనుంది. మరోవైపు ఆయన ఆరోగ్యంపై అభిమానలలో ఆందోళన నెలకొంది. రజనీకాంత్‌ ఈనెల 31న చెన్నైలో జనవరిలో తాను ప్రారంభించబోయే పార్టీ పేరు ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రజనీ మక్కల్‌ మండ్రం నిర్వాహకులు నగరంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో ఏర్పాట్లను చేప‌డుతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న హాస్పిట‌ల్‌లో చేర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి రాజ‌కీయ పార్టీకి సంబంధించిన స‌మావేశాలు వాయిదా ప‌డ‌తాయా అన్న‌ది తెలియాల్సి ఉంది. ర‌జినీ హాస్పిటల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే కానీ రాజ‌కీయాల‌పై పూర్తి క్లారిటీ రాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here