రెండో ద‌ఫా క‌రోనా విజృంభ‌ణ‌.. ఉల్లి, వెల్లుల్లి వాస‌న రాక‌పోతే ఏం చేయాలి..

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను క‌చ్చితంగా రుచి, వాస‌న కోల్పోతే నిర్ధారించ వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. ఇన్నాళ్లూ జ్వ‌రం, జ‌లుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ల‌క్ష‌ణాల ఆదారంగా క‌రోనాను నిర్ధారిస్తున్నారు. ప‌లు చోట్ల రుచి, వాస‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు.

అయితే లండన్ ప‌రిశోధ‌కులు రుచి,వాస‌న‌కు సంబంధించి క‌చ్చిత‌మైన స‌మాచారాన్ని సేక‌రించారు. రుచి, వాసన కోల్పోయిన వారిలో ప్ర‌తి ఐదుగురిలో ఒక‌రికి యాంటీ బాడీలు వృద్ధి చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు. దీంతో రుచి వాస‌న కోల్పోయిన వారంతా క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌కు కూడా ఇదే విష‌యాన్ని లండ‌న్ చెబుతోంది. రుచి, వాస‌న ఏం కోల్పోయినా వెంట‌నే వీరికి క‌రోనా సోకిన‌ట్లు గుర్తించాల‌ని చెప్పింది. ఎందుకంటే వీరిలో క‌చ్చితంగా యాంటీబాడీలు వృద్ది చెంది ఉంటాయ‌ని పేర్కొంది.

ఇప్ప‌డు రెండో ద‌ఫా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. దీంతో ఈ ల‌క్ష‌ణాల ద్వారా త్వ‌ర‌గా వైర‌స్‌ను గుర్తించ‌వ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే ప‌లు దేశాలు దీన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇంట్లో వాడే ఉల్లిపాయ‌, వెల్లుల్లి వాస‌న‌లు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతే క‌చ్చితంగా వారు టెస్టు చేయించుకోవ‌డం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here