తెలుగు తెరపై హాస్య నాటుడిగా తనదైన ముద్ర వేశారు నటుడు అల్లు రామలింగయ్య. ఆయన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతూ కుమారుడు అల్లు అరవింద్.. మనవళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా అల్లు రామలింగయ్య గుర్తుగా ఏకంగా ఓ స్టూడియోనే నిర్మించే పనిలో పడ్డారు ఆయన కుటుంబసభ్యులు. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య 99వ జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అనుకున్నదే తడువుగా స్టూడియో పనులు కూడా మొదలు పెట్టేశారు. హైదరాబాద్ నానక్ రామ్‌గూడ ఏరియాలో 10 ఎకరాల విస్తీర్ణంలో స్టూడియోను నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే తాజాగా స్టూడియో నిర్మాణ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అత్యంత ఆధునిక హంగులతో ఈ స్టూడియోను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది అల్లు శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ప్రారంభించేందుకుగాను నిర్మాణ పనులను శరవేగంగా జరుపుతున్నారు. స్టూడియో నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్, అల్లు బాబీ (వెంకటేష్), అల్లు శిరీష్, స్నేహా రెడ్డి, అర్హ తదితరులు పాల్గొన్నారు.
Here are few highlights from the launch of @AlluStudios by #AlluFamily #AlluAravind @Bobbyallu @alluarjun @AlluSirish pic.twitter.com/5CcwPWfSh9
— BARaju (@baraju_SuperHit) October 2, 2020