సముద్రాన్ని చూస్తే రష్మికకు ఏమనిపిస్తోందో తెలుసా.?

తన క్యూట్‌ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది నటి రష్మిక మందన. వరుస సినిమాలతో జోష్‌ మీదున్న రష్మిక సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవలే సముద్రపు ఒడ్డున వర్కవుట్లు చేస్తోన్న వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

View this post on Instagram

Endless possibilities 🤍

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మరో ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేసిందీ బ్యూటీ. సముద్రతీరంలో బండరాళ్లపై కూర్చుని సముద్రాన్ని తదేకంగా చూస్తున్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా రష్మిక పక్కన ఉన్న ఎవరో వ్యక్తి.. ‘అలలతో ఎగిసిపడే సముద్రాన్ని చూస్తే నీకేమనిపిస్తోంది’ అని ప్రశ్నిస్తే.. ‘అపరిమిత అవకాశాలు కనిపిస్తున్నాయ’ని ఫిలాసఫితో కూడిన జవాబునిచ్చిందీ బ్యూటీ. ఇక కెరీర్‌ విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో రష్మిక తొలిసారి కెరీర్‌లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here