బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలిసిపోయింది..

బుల్లితెర‌లో విశేష ఆద‌ర‌ణ పొందుతున్న షోల‌లో బిగ్ బాస్ షో ఒక‌టి. ప్ర‌స్తుతం బిగ్ బాస్ 4వ సీజ‌న్ న‌డుస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది అభిమానులు కార్య‌క్ర‌మాన్ని వీక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం షో ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది.

ఫైన‌ల్ వ‌చ్చిందంటే విన్న‌ర్ ఎవ‌ర‌న్న టెన్ష‌న్ చాలా ఉంటుంది. ఈ టెన్ష‌న్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే ఓ గెస్ట్ షోకు వ‌స్తారు. విజేత ఎవ‌రో ప్ర‌క‌టిస్తారు. ఇది మామూలుగా జ‌రుగుతూ ఉంటుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌కు ఐదు మంది కంటెస్టెంట్స్‌ ఎంపికయ్యారు. అభిజీత్‌, అఖిల్‌, అరియానా, హారిక, సోహైలలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. దీంతో పాటు అందరిలో ఆసక్తిని కలిగించిన మరో అంశం.. బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌ గెస్ట్‌ ఎవరనేది. మెగాస్టార్‌ చిరంజీవి లేదా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లలో ఒకరు ఫైనల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వార్తలు షికార్లు చేశాయి. అయితే లేటెస్ట్‌ సమాచారం మేరకు మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌కు అతిథిగా రాబోతున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తారు. ఇదే కనుక నిజమైతే బిగ్‌బాస్‌ నాలుగు సెషన్స్‌లో రెండుసార్లు ఫైనల్‌కు వచ్చిన చీఫ్‌ గెస్ట్‌ చిరంజీవే అవుతారు మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here