భార‌త్‌లో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా..

ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ కేసులు ఇంకా న‌మోద‌వుతూనే ఉన్నాయి. ప‌లు దేశాల్లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే కేసుల తీవ్ర‌త త‌గ్గినా.. పాజిటివ్ కేసులు మాత్రం వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు ఇంకా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

భారత దేశంలో కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,087 కరోనా కేసులు నమోదు కాగా..338 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 99,79,447కు చేరింది. 1,44,789 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,13,831 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స నుంచి కోలుకుని 95,20,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.93 శాతం కాగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉందని శుక్రవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక క‌రోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్ర‌జ‌లు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం సైతం వ్యాక్సిన్ విష‌యంలో తీవ్రంగా కృషి చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పంచేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాకు సంబంధించిన స‌మాచారం అంద‌జేసింది. ఎప్పుడు వ్యాక్సిన్ వ‌చ్చినా ప్ర‌జ‌ల‌కు అందించేందుకు రెడీగా ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here