బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కియారా అడ్వాణీ..?

హీరోయిన్ కియారా అడ్వాణీ ఊహించ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందని తెలుస్తోంది. తెలుగులో మ‌హేష్ బాబు, రాం చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ సినిమాల్లో న‌టించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా ఓ భారీ ప్రాజెక్టుకు సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ గురించి బాలీవుడ్‌లో మంచి టాక్ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. కబీర్‌సింగ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది ఈమె. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఆ విషయంలో కూడా స్పష్టత వచ్చేసినట్టు తెలుస్తోంది. కియారా ఈ సినిమాలో న‌టించే అవకాశం కొట్టేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here