‘దేవదాసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి ఇలియాన. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ గోవా బ్యూటీ టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. ఇక ఇటీవల ఇలియాన సినిమాలకు కాస్త దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. చివరిగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఇలియానాకు అలవాటు.
ఇదిలా ఉంటే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఓ ఫొటో దానికి ఇచ్చిన క్యాప్షన్ వైరల్‌గా మారింది. గతంలో ఇలియానా శరీరానికి సంబంధించి బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ట్రోలింగ్స్‌కు సమాధానం చెబుతున్నట్లుగా తన శరీరంలోని ప్రతి అవయవం గురించి వివరించింది. తాను అందంగా లేనంటూనే తన శరీర సౌష్టవాన్ని వివరించింది. ఇంతకీ ఇలియాన చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. ‘నా హిప్ చాలా వెడల్పుగా ఉంటుంది. నా తొడలు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. నా నడుము అంత విశాలంగా ఉండదు. ఇక నా వక్షోజాలు అంత పెద్దవి కావు.. నా ఉదరం చదునుగా ఉండదు. నా చేతులు కూడా భిన్నంగా ఉంటాయి. ముక్కు కూడా సూటిగా ఉండదు. పెదాలు కూడా ఉండాల్సినంత ఉండవు. నేను మరీ అంత పొడవుగా కూడా ఉండను’ అని చెబుతూనే.. ఆ లోపాలే తనకు అందాలంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అంతేకాకుండా తానేప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోలేదని, తన అందం తనదే అని భావించానని చెప్పుకొచ్చిందీ భామ.