వైసీపీలోకి టిడిపి ఎమ్మెల్యేల చేరిక‌లు ఫిక్స‌యిన‌ట్లుంది..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీలోకి టిడిపి ఎమ్మెల్యేల చేరిక‌లు ఇక లాంఛ‌న‌మేనా అనిపిస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన ప‌లువురు టిడిపిని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా మ‌రికొంత మంది వైసీపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

విశాఖ‌లో వైసీపీ నేత‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. వై.ఎస్ జ‌గ‌న్ పాలన‌ను చూసి వైసీపీలోకి వ‌చ్చేందుకు ఎమ్మెల్యేలు ఆస‌క్తిగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు స‌మాచారం. ప‌లు ప్ర‌తిపాద‌న‌లు జ‌గ‌న్ ప‌రిశీలన‌లో ఉన్నాయంట‌. జ‌గ‌న్ స‌రైన విధంగానే నిర్ణ‌యం తీసుకుంటార‌ని విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. త‌మ పార్టీకి ప‌లు సిద్దాంతాలు ఉన్నాయ‌ని.. ఎమ్మెల్యేలు పార్టీలోకి రావాలంటే ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈయ‌న మాట‌లను బ‌ట్టి పార్టీలోకి రావాల్సిన వారు చాలా మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీరు డైరెక్టుగా రావాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి కాబ‌ట్టి అలా కాకుండా త‌మ కుటుంబ స‌భ్యుల్లో కొంద‌రిని వైసీపీలోకి పంపిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు టిడిపిని వీడిన ఎమ్మెల్యేలంతా ఇదే ప‌నే చేశారు. ఇక ఇప్ప‌టికే ప‌లువురు టిడిపి ఎమ్మెల్యేల పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరంతా జ‌గ‌న్ నిర్ణ‌యించిన ముహూర్తంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here