ఇండియాతో పెట్టుకుంటే ట్రంప్‌కు ఇలా అయ్యిందేంటి..

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క‌రోనా సోకింది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే ట్రంప్ నిన్న‌నే ఇండియా గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత వెంట‌నే క‌రోనా బారిన ప‌డ‌టంతో ఇష్యూ గురించి డిస్క‌ష‌న్ మొద‌లైంది.

ట్రంప్ మొద‌టి నుంచి క‌రోనాను లైట్ గానే తీసుకున్నారు. మాస్క్ పెట్టుకోమంటే అవ‌స‌రం లేద‌ని చెప్పిన వ్య‌క్తుల్లో ట్రంప్ ఒక‌రు. అయితే ఆ త‌ర్వాత చాలా లేట్ గా ఆయ‌న మాస్క్ విలువ తెలుసుకొని మాస్క్ పెట్టుకొని క‌నిపించారు. క‌రోనాకు త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఆయ‌న వైద్యుల మాట‌ల‌ను విభేదించి మ‌రీ ధీమా వ్య‌క్తం చేశారు. అయితే ట్రంప్ స‌ల‌హాదారుల్లో ఒక‌రైన హోప్ హిక్స్‌కు కరోనా సోక‌డంతో వీరికి సోకిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ట్రంప్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

క‌రోనా సోక‌డంతో క్వారంటైన్‌లోకి వెళుతున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. కాగా ఇటీవ‌ల ట్రంప్ క‌రోనా విష‌యంలో భార‌త్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. భార‌త్ క‌రోనా మ‌ర‌ణాల‌ను దాచిపెట్టి లెక్క‌లు చెబుతోందంటూ ఆయ‌న ఎన్నిక‌ల చ‌ర్చ‌ల్లో మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మోదీని ఉద్దేశించి వ్యంగాస్త్రాలు కూడా సంధించింది. ప్రియ మిత్రుడు అనుకుంటే భార‌త్‌పైనే ఇలా వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడింది. కాగా ట్రంప్ దంప‌తులు క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోదీ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here