హ‌థ్ర‌స్ ఘ‌ట‌న‌లో నిందితుల‌కు ఉరిశిక్ష ఖాయ‌మేనా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్ర‌స్‌లో జ‌రిగిన యువ‌తి ఘ‌ట‌న‌లో నిందితులు ఇక త‌ప్పించుకోలేర‌ని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే నిర్భ‌య కేసును వాదించిన లాయ‌ర్ ఇప్పుడు ఈ కేసు త‌రుపున పోరాడేందుకు ముందుకు వ‌చ్చింది. దీంతో హ‌థ్ర‌స్ ఘ‌ట‌న‌లో బాదితురాలి కుటుంబ సభ్యుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

నిర్భ‌య కేసును ప్ర‌ముఖ న్యాయ‌వాది సీమా కుష్వాహా వాధించారు. 2012 డిసెంబ‌ర్ 16వ తేదీన దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ ఘ‌ట‌న జ‌రిగి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘ‌ట‌న‌లో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకుంది. అప్ప‌ట్లో ఈ కేసును వాధించిన ఈమె కేసు గెలిచారు. దీంతో ఒక్క‌సారిగా ఈమె ఫేమ‌స్ అయ్యారు.

ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హ‌థ్రాస్ ఘ‌ట‌న కేసును కూడా ఈమె వాదించేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఆమె బాదితురాలి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడేందుకు వెళుతుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మాట్లాడుతూ త‌న‌ను బాదితురాలి కుటుంబ స‌భ్యులు పిలిస్తే వెళుతున్నాన‌ని చెప్పారు. ఎవ్వ‌రు అడ్డు చెప్పినా వారిని క‌లిసే తాను తిరిగి వెళ‌తాన‌ని ఆమె అన్నారు. దీన్ని బ‌ట్టి దేశం మొత్తం ఇప్పుడు ఈమె వైపే చూస్తోంది. కచ్చితంగా ఈ కేసులో కూడా విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నారు. కాగా హ‌థ్ర‌స్ ఘ‌ట‌న‌లో బాదితురాలిపై అత్యాచారం చేయ‌లేద‌ని పోస్టుమార్టంలో వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here