స‌మంత ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుందా..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్, అక్కినేని కోడ‌లు స‌మంత ఓ కొత్త పాత్ర చేయ‌డానికి ఓకె చెప్పింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాల‌తో పాటు ఓటీటీలో కూడా స‌మంత దూసుకుపోతోంది. క‌రోనా త‌ర్వాత అత్యంత బిజీ అయిపోయిన క‌థానాయిక‌ల్లో స‌మంత ముందు వ‌రుస‌లో ఉంటారని చెప్పొచ్చు. తాను చేస్తున్న సామ్ జామ్ షోకు ఎంతో మంది సెల‌బ్రెటీల‌ను తీసుకొస్తూ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటోంది సమంత‌.

వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అవుతున్న భారతీయ నాటకాల్లో శాకుంతలం మొద‌టిది. డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ఈ సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా ఆయ‌న ఇటీవ‌ల విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్ర‌లు చాలా కీల‌కం. శకుంత‌ల‌గా ఎవ‌రు న‌టిస్తార‌న్న దానిపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తాజాగా స‌మంత ఈ సినిమాలో శ‌కుంత‌ల పాత్ర‌లో న‌టిస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు శకుంతల పాత్రలో సమంత అక్కినేని నటించనున్నారని, దానికి సంబంధించిన అప్‌డేట్‌ రానుందని టాక్‌ వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో మూవీకి సంబంధించిన అఫిషియ‌ల్ స‌మాచారం బ‌య‌ట‌కు రానుంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here