క‌రోనా త‌ర్వాత ఎన్ని వైర‌స్‌లు రానున్నాయో తెలుసా..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రూ క‌రోనాకు భ‌య‌డిపోతున్నారు. ఇప్ప‌టికే ఇంకా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. వ్యాక్సి్ వ‌చ్చినా ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అంతా చెబుతున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌నామ్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వైర‌స్ అయిపోయినంత మాత్రాన మ‌నం సంతోష ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న మాటల్లో అర్థం అవుతోంది. ఈ వైర‌స్ త‌ర్వాత ఇంకా ఎన్నో వైర‌స్‌లు మాన‌వుల‌పై దాడి చేయొచ్చ‌ని ఆయ‌న చెప్పారు. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత పూర్తిగా లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల అన్ని రంగాల్లో పూర్తిగా దెబ్బ‌తిన్నామ‌ని గుర్తు చేశారు. అయితే ఈ వైర‌స్‌ను ఎదుర్కోవ‌డం ఒక్క‌టే మ‌న స‌వాల్ కాద‌న్నారు.

భ‌విష్య‌త్తులో ఎలాంటి వ్యాధులు రాకుండా స‌రైన చ‌ర్య‌లు తీసుకోవడం లేద‌ని ఆయ‌న తెలిపారు. దూర‌దృష్టితో ఆలోచించి ఇప్ప‌టి నుంచే అన్ని ర‌కాగా జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంటు వ్యాధులు వ‌చ్చిన స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటూ .. త‌ర్వాత నిర్లక్ష్యంగా ఉంటున్నార‌న్నారు. ఇలా చేయ‌డం మంచిది కాద‌న్నారు. ఈయ‌న మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే భ‌విష్య‌త్తుల్లో వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here