జ‌న‌వ‌రి 1వ తేదీన ష‌కీలా మూవీ రిలీజ్‌..

ష‌కీలా ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. సిల్క్‌స్మిత త‌ర్వాత అంత‌లా పాపుల‌ర్ అయ్యారు ష‌కీలా. ఇప్పుడు ష‌కీలా బ‌యోపిక్ రాబోతోంది. ఇప్ప‌టికే ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. త్వ‌ర‌లోనే తెలుగులో రిలీజ్ అవ్వ‌బోతోంది.

షకీలా సాధారణ స్టార్‌ నుండి సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగారనేది ఈ సినిమాలో చూపిస్తున్నారు. డిసెంబర్ 25న నార్త్‌లో సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమాను తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నారు. రిచా చద్దా ఇందులో టైటిల్‌ పాత్రలో నటించారు. ఇంద్రజీత్‌ లంకేష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. తను బతికి ఉండగానే తన బయోపిక్‌ రావడంపై షకీలా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తనలా ఎవరూ మోసపోకండనే సందేశాన్ని ఇస్తున్నట్లు కూడా రీసెంట్‌గా షకీలా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here