ఎన్టీఆర్ షూ రేటు ఎంతో తెలుసా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా సినిమాకు ఆయ‌న విభిన్న‌మైన స్టైల్లో క‌నిపిస్తూ అభిమానుల‌ను సంద‌డి చేస్తుంటారు. అందుకే ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌. తాజాగా ఆయ‌న ఓ కొత్త లుక్‌లో క‌నిపించారు.

రీసెంట్‌గా ఎయిర్‌పోర్టులో ఉన్నఎన్టీఆర్‌ లుక్‌ బయటకు రాగా.. అందులో అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది ఆయ‌న షూ. ఎన్టీఆర్‌కు క‌రెక్టుగా సూట్ అయ్యేలా ఉన్న ఆ షూ గురించి ఫ్యాన్స్ చాలా వెతికార‌ని తెలుస్తోంది. షూ ఏ కంపెనీ అని, దాని రేటు ఎంతో అని తెలుసుకోవాల‌ని అంద‌రూ అనుకున్నారు. తాజాగా దానికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ వేసుకున్న ఆ షూ హెర్మస్‌ కంపెనీది. దాని రేటు రూ. 75 వేలు.. విష‌యం తెలిసిన వారంతా సూప‌ర్ అంటున్నారు. స్టైలిష్ స్టైల్‌లో క‌నిపిస్తున్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. స్టార్‌ హీరోలు ఏం చేసినా అభిమానులకు గొప్పే అంటే ఇదేనేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here