చంద్రబాబుకు ఐటీ నోటీసులు రాబోతున్నాయా?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ షాలు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేయబోయే నిర్ణయం తీసుకోబోతున్నరనే చర్చ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారని.. త్వరలోనే ఆయనకు షాకివ్వబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని గద్దెదించడానికి చేయని ప్రయత్నం లేదు. దేశంలోని ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి మోడీకి వ్యతిరేకంగా చేసిన లాబీయింగ్ ను అటు మోడీకానీ, ఇటు అమిత్ షా కానీ మరిచిపోలేదు. త్వరలోనే చంద్రబాబు ఖేల్ ఖతం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇటీవలే నవంబర్ 11 న ఆర్థిక శాఖ అనుమతితో సీబీడీటీ కమిషనర్ సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.. ఒక ప్రముఖ కన్ స్ట్రక్షన్ సంస్థ ఏపీలోని ముఖ్య ప్రముఖ నాయకుడికి 150 కోట్లు ముడుపులు ఇచ్చిందని బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. త్వరలోనే ఆ ముఖ్య నాయకుడికి, అతడి బినామీలపై ఐటీ దాడులు జరగబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

తమను గద్దెదించడానికి ప్రయత్నించి ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన చంద్రబాబును కేంద్రంలోని మోడీషాలు అంత ఈజీగా వదలిపెట్టరని వారిని దగ్గరి నుంచి చూసిన వారు ఎవరైనా చెబుతుంటారు. ఇప్పుడు చంద్రబాబును కూడా టార్గెట్ చేశారని ఐటీ నోటీసులు పంపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఏపీలోని అమరవతి రాజధానిలో ముడుపుల వ్యవహారంలో ముఖ్యనాయకుడు చంద్రబాబేనని.. ఆయననే ఐటీ శాఖ టార్గెట్ చేయబోతోందని ఏపీలోని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాబుపై చర్యలు తీసుకోవాలని వీరంతా ముక్తకంఠంతో మోడీషాలపై ఒత్తిడి తెస్తున్నారట.. మరి ఆ ముహూర్తాన్ని మోడీషాలు ఫిక్స్ చేశారని.. త్వరలోనే ఐటీ నోటీసులు తేబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Comments

comments

Leave a Reply

*