కాళేశ్వరం భూగర్భ పంపింగ్ కేంద్రం ‘మేఘా’ విశిష్టతలు

 • భూ ఉపరితలంపై నిర్మాణాల పూర్తికి దశాబ్దాలు పడుతుంటే భూగర్భాన్ని తొలిచి భారతదేశంలోనే అతిపెద్ద భవంతి లాంటి పంప్‌హౌస్‌ మూడున్నరేళ్లలో నిర్మించిన ఘనత మేఘా ఇంజనీరింగ్‌ది.
 • ప్యాకేజీ 8 భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం ఎంత పెద్దదంటే దీని ముందు ఈఫిల్‌ టవరే చిన్నబోతుంది. ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్‌హౌస్‌ పొడవు 327 మీటర్లు.
 • ఇండియాలో అతి పొడవైన భవంతి కలకత్తాలో ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్‌హౌస్‌ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు.
 • ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్‌ బయటకు తీసిందంటే అది సామాన్య విషయం కాదు.
 • ప్యాకేజీ 8 భూగర్భ పంపింగ్‌ కేంద్రం ఎంత పెద్దదో ఊహించుకోండి. దాని వైశాల్యం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు. అదెంతో తెలుసా..? 84,753.2 చదరపు అడుగులు.
 • పంప్‌ చేయడానికి అవసరమైన నీటిని నిల్వ చేయడం కోసం నిర్మించిన సర్జ్‌పూల్‌ కూడా ఈఫిల్‌ టవర్‌ కన్నా పొడవులో పెద్దది. మొత్తం 4 సర్జ్‌పూల్స్‌ ఉండగా అందులో ప్రధాన సర్జ్‌పూల్‌ 325 మీటర్ల పొడవుతో నిర్మించడం ప్రపంచంలోనే అరుదైన ఇంజనీరింగ్‌ అద్భుతం.
 • ప్రపంచంలో కొలరాడో (అమెరికా), గ్రేట్‌ మేన్‌మేడ్‌ రివర్‌ (లిబియా) లాంటి ఎత్తిపోతల పథకాలు ఇప్పటి వరకూ అతిపెద్దవి కాగా కాళేశ్వరం ముందు అవి చిన్నవైపోయాయి. ఇక ప్యాకేజీ 8 భూగర్భ పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది అటు ఒక్కో మిషన్‌ వారీగా చూసినా మొత్తం అన్ని మిషన్లు కలిపిన సామర్ధ్యంతో పోల్చి చూసినా. పైగా ఇది భూగర్భంలో నిర్మించింది కావడం మరో ప్రత్యేకత.
 • ఈ పంపింగ్‌ కేంద్రం భూ ఉపరితలానికి 470 అడుగుల దిగువన (రెడ్యూస్డ్‌ లెవెల్‌) నిర్మించింది మేఘా ఇంజనీరింగ్‌.
 • ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లను పంపింగ్‌కు సిద్ధం చేయగా ఇవి ఎంత పెద్దవంటే అనుబంధ పరికరాలతో కలిపి ఒక్కో మిషన్‌ బరువు 2376 మెట్రిక్‌ టన్నులు. ఒక్కో లారీలోను 20 టన్నుల సరుకు రవాణా చేస్తుంటారు. ఆ ప్రకారం చూస్తే ఎన్ని లారీల సరుకులతో ఇది సమానమో ఆలోచించుకోండి.
 • మిషన్‌లో ప్రధానమైనవి స్టార్టర్‌, రోటర్లు. స్టార్టర్‌ బరువు 216 టన్నులు కాగా రోటర్‌ బరువు 196 టన్నులు.
 • సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు లేనే లేవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారంటే ఆ పంపు మోటార్లు పెద్ద పెద్ద కొండలే చిన్నబోయేలా వున్నాయి కదా! తద్వారా 300 టన్నుల బరువు మోయగలిగిన ఇఒటి క్రేన్‌ ఏర్పాటు చేశారు.
 • ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌ తోపాటు 50 వేల టన్నుల సిమెంట్‌, కాంక్రీట్‌ వినియోగించారు.
 • ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్‌ చేసే విధంగా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్‌ కుడికాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్ధ్యం 11,000 క్యూసెక్కులు అయితే ఇక్కడ 22,000 క్యూసెక్కుల నీరు పంపింగ్‌ ద్వారా వస్తుంది.
 • భూగర్భం నుంచి4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్‌ చేసే విధంగా మిషన్లను ఏర్పాటు చేశారంటే నమ్మశక్యం కావడం లేదు. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేయడమే అరుదు. అటువంటిది ఈ పథకంలో అంత ఎత్తుకు రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీల వరకు పంప్‌చేసే సామర్ద్యం వుందీ అంటే ఈ మేఘా పంపింగ్‌ కేంద్రం ఎంత ఘనమైనదో ఊహించుకోవచ్చు.
 • మేఘా ఇంజనీరింగ్‌తో పాటు దేశీయ ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ దిగ్గజం బిహెచ్‌ఇఎల్‌తోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విదేశీ కంపెనీలు Telk, Siemens, Wartsila, MMT, LS Cables, Hilti, Atlas Copco, Normet, Sandvik తదితర సంస్థలు మేఘా ఇంజనీరింగ్‌కు తమ సేవలను అందించాయి.
 • ఇందులో 160 ఎంవిఎ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఒక్కో మిషన్‌కు ఒక్కోటి చొప్పున అమర్చారు. 400 కెవిఎ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ ద్వారా మిషన్లకు సరఫరా అవుతుంది.
 • సాధారణంగా నీటి పంపింగ్‌ కేంద్రాలు భూ ఉపరితలం మీదే వుంటాయి. మొట్టమొదటిసారిగా అతిపెద్ద పంపింగ్‌ కేంద్రాన్ని భూగర్భంలో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించింది. దీని విద్యుత్‌ వినియోగ, పంపింగ్‌ సామర్ధ్యం 973 మెగావాట్లు అంటే నమ్మగలరా? విడివిడిగా చూస్తే శ్రీశైలంలోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాల కన్నా, నాగార్జునసాగర్‌లో ఒక జలవిద్యుత్‌ కేంద్రం ఉత్పత్తి స్థాయి కన్నా దీని వినియోగం ఎక్కువ. వాస్తవానికి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, పంప్‌హౌస్‌ వేర్వేరు రకాలు. కాని విద్యుత్‌ పరిమాణాన్ని ఉదహరించడానికి అలా చెప్పాల్సి వచ్చింది.
 • ఉపరితలంలో నిర్మించే పంప్‌హౌస్‌కు పునాదులతోపాటు నిర్మాణ సమయంలోనూ మార్పులు – చేర్పులు సులభమవుతాయి. కానీ భూగర్భ పంపింగ్‌ కేంద్రాన్ని నీటి లభ్యత, నీటిమట్టం ఆధారంగానే అవసరమైన లోతులో నిర్మించాలి. ఇష్టం వచ్చిన తరహాలో భూగర్భంలో మార్పులు – చేర్పులు చేయడానికి వీలు పడదు. అంటే నిర్మాణ పరంగా ఎంత క్లిష్టమైన పనిని మేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో మూడున్నరేళ్లలో పూర్తి చేసిందో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు.

పంప్హౌస్ఆకృతి నిర్మాణంలో కీకమైన ప్రదేశాలు (భూ ఉపరితలం నుంచి మీటర్ల లోతున)

 • సర్వీస్‌బే: 210 మీటర్లు
 • పంప్‌బే: 190.5 మీటర్లు
 • యాన్సిరీ బే: 195.5 మీటర్లు
 • ట్రాన్స్‌ఫార్మర్‌బే: 215 మీటర్లు
 • కంట్రోల్‌ రూం: 209 మీటర్లు
 • కాళేశ్వరం పథకంలో మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాలను (ఈ పథకం బహుళదశ ప్రపంచంలో పెద్దది) నిర్మిస్తుండగా అందులో 17 కేంద్రాలను ఎంఇఐఎల్‌ నిర్మిస్తోంది.

Comments

comments

Leave a Reply

*