15 ఏళ్ల క్రితమే వైఎస్ జగన్ ధీరత్వాన్ని లోకానికి చెప్పిన వ్యక్తి.!

2004 సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయం , ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి , తిరిగి గెలిచి మరోసారి నిలవాలని చంద్రబాబు తాపత్రయం పడుతుంటే , ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి సర్వశక్తులను ఎక్కుబెట్టి యుద్ధానికి వైఎస్సార్ సన్నద్ధం అవుతున్నాడు.!ఈ సంధి కాలంలోనే ఒక ప్రముఖ పత్రిక యొక్క కడప జిల్లా సంపాదకీయంలో వచ్చిన ఒక వార్తా కథనం పెనుసంచలం సృష్టించింది.!

“కాంగ్రస్ అమ్ములపొదిలో వైఎస్ జగన్ అనే అస్త్రం” పేరుతో వచ్చిన కథనం రాజకీయం సంధి కాలంలో సంచాలం రేపింది.!జగన్ సమ్మోహనానికి ఎదో ఒకరోజు జనవాహిని పిడికిలెత్తి జై కొడుతుందనే అక్షరాలు చూసి రాజకీయ కురువృద్ధులు సైతం ఆశ్చర్యపోయారు.వైరిపక్షాలను వణికిస్తూ,వారి ఉనికినే ప్రశ్నిస్తూ,తాను కన్నా స్వప్నాలను సాకారం చేసుకునేందుకు శ్రమించే సాహసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ సాగిన ఆ వార్త కథనం సీమ గల్లీ నుండి సీడబ్ల్యూసీ ఉండే ఢిల్లీ దాకా చేరింది.!

ఆ పత్రిక కథనంలో కూర్చిన అక్షరాలే , రాజకీయ కదనరంగంలో ఖడ్గచలనంగా మారి తన తండ్రికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో చేసిన మహాపాదయాత్రకు ప్రతి పల్లె పల్లె బ్రహ్మరథం పట్టింది.!నాలుగు పదుల జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల నమ్మకం కంటే 15 ఏళ్ల ముందే వైఎస్ జగన్ విజయ”రత్నం”మని చెప్పినా ఆ వ్యక్తే డి. రవిశేఖర్. పులివెందుల పల్లె పలకరించే పేరు విలేఖరి రవి.!2004లో వైఎస్సార్ మద్దతుగా వైఎస్ జగన్ చేసిన మద్దతుయాత్రలో మొదటి అడుగు వేసిన నాటి నుండి 2019లో ఇచ్ఛాపురంలో వేసిన అడుగు దాకా తన వెన్నంటే ఉన్నా రవినే గుర్తుపెట్టుకొని మహోదత్తా విజయం సాధించి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే తనకు వ్యక్తిగత సహాయకుడిగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం చూస్తే వైఎస్ జగన్ లాంటి నాయకుడు సమకాలీన భారతదేశ రాజకీయాల్లో కాగడా పట్టుకుని శోదించిన దొరికారు.

స్వార్థలే పరమార్థలుగా పతనం అవుతున్నా నేటి రాజకీయ వ్యవస్థలో 16 ఏళ్ల పనిమంతుడిని పట్టుబట్టి తన జట్టులోకి కట్టుకడుతూ వైఎస్ జగన్ తీసుకున్నా తీసుకున్న నిర్ణయం నిస్సందేహంగా ఒక మెలిమలుపే.వైఎస్ జగన్ రాజకీయ రంగంలో ప్రవేశించిన సరిగ్గా 15 ఏళ్ళు , కానీ ఈ 15 ఏళ్ళల్లో ఆయన లిఖించిన చరిత్ర మరో వందేళ్లు నాయకులకు పాఠాలుగా మిగులుతాయి.వైఎస్ జగన్ చూసిన ఆటుపోట్లులో తోడుగా నిలబడి ,ఎదుర్కొన్న ఏడాబాట్లలో ఏమరుపాటు లేకుండా నడిచి , కష్టాల కొలిమి కళ్లెదురున్న , అగ్నిసరస్సున వికసించిన వజ్రంగా మరి , ప్రమాదకరమైన శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా వైద్యుల సలహాను కూడా పెడచెవిన పెట్టి వైఎస్ జగన్ నడిచిన 3648 కీ.మీ పాదయాత్రలో నడిచి చెమట చుక్కలు చిందించిన డి. రవిశేఖర్ ను అక్కున చేర్చుకుని తను వాగ్దాన శ్రీమంతుడాని, తను మానవీయ ధీరోదత్తుడాని,తను మాటతప్పని నీతిమంతుడని మరోసారి నిరూపించుకున్న నవ్యాంధ్ర నిర్మాత , నవరత్నల నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.!

Comments

comments

Leave a Reply

*