ప్రాజెక్టుల పూర్తి లో ఎంఈఐఎల‌్ 130 రికార్డ్

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజ కంపెనీ ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్,  గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్,  ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట‌్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

రాజస్థాన్ లోని రాగేశ్వరి ప్రాంతంలో కెయిర్న్ ఇండియా లిమిటెడ్ నుండి 2018 ఆగస్టులో పొందిన 80 ఎంఎంఎస్‌సీఎఫ్ఈడి సామర్థ్యం కలిగిన గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ (ఆర్‌జీటీ) గ్యాస్ ప్రొసెసింగ్ ప్రాజెక్టు పనులను సెప్టంబర్ 2018లో ప్రారంభించి, 2019 మార్చి నాటికి  కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించింది.  భూసేకరణ, ఇంజనీరింగ్ అనుమతులు, తదితర పనులు ఏక కాలంలో చేయడం వల్ల పని తొందరగా పూర్తి చేయగలిగింది. ఈ గ్యాస్ టెర్మినల్ నిర్వహణ బాధ్యతలను 18 నెలల పాటు “ఎంఈఐఎల్” చేపట్టింది.

గత ఏడాదికాలంలో అనేక సాగునీటి  సరఫరా కోసం ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయడం చేసింది.  ఆంధ్రప్రదేశ్ లోని కొండవీటి వాగు, చింతలపూడి, పురుషోత్తపట్నం, హంద్రీ-నీవా ఫేస్ 2 ఎత్తిపోతల పథకం అలాగే కర్నాటకలోని ఉత్తూర్, కోలార్, గుజరాత్ లోని సౌరష్ట్ర బ్రాంచ్ కెనాల్ పంప్ హౌజ్ 1, 3 లతో పాటు సాని యోజన ఎల్ 3, పి 5 తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించింది. విద్యుత్ పంపిణీ రంగంలో నర్సాపూర్ లీలో లైన్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డి పల్లి, మహేశ్వరం, పొదిలి-సత్తెనపల్లి విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్ణీత గడువుకు ముందే ఎంఈఐఎల్ పూర్తి చేసింది.

గుజరాత్ లోని సౌరాష్ట్ర కాలువపై రెండు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను విజయవంతంగా పూర్తి  చేసి ఉత్పత్తిని ప్రారంభించింది.  ఒక్కొక్కటి 15 మెగా వాట్ల సామర్థ్యంతో మూడు జల విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తుండగా, ప్రతి యూనిట్లో 5 మెగావాట్ల సామర్ధ్యంతో 3 టర్భైన్లను ఏర్పాటు చేసింది. వీటి మొత్తం సామర్థ్యం 45 మెగావాట్లు. ఇప్పటికే రెండు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి  ప్రారంభమైంది. మూడో యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఈ యూనిట్లను సర్దార్ సరోవర్ (నర్మదా) ప్రాజెక్టు సౌరాష్ట్ర కాలువపై నిర్మించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ భాద్యతలను కూడా ఐదు సంవత్సారాల పాటు ఎంఈఐఎల్ చేపట్టింది. ఎంఈఐఎల్‌ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన  నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో భాగంగా ప్యాకేజీ 8లో ని రామడుగు 400 కేవీ సబ్ స్టేషన్ ను విజయవంతంగా గత ఆర్థిక సంవత్సరంలోనే  చార్జింగ్ చేసింది. కాళేశ్వరం మొత్తం పనులలో ఈ సబ్ స్టేషన్‌ పనులను మొట్టమొదటిదిగా పూర్తిచేసింది. ఈ సబ్ స్టేషన్ ను ప్యాకేజీ 8 అండర్ గ్రౌండ్ లోని 7 మోటార్ పంపులకు అనుసంధానించింది.  ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్లు ఇవి.  ఒక్కో యూనిట్ సామర్థ్యం 139 మెగా వాట్లు.

400/220 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ సుందిళ్ల పంప్ హౌజ్ లోని 9 పంపు మోటార్లకు విద్యుత్ అందించడంతో పాటు అన్నారం, మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందిస్తుంది. అలాగే 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్ నుంచి అన్నారం పంప్ హౌజ్ లోని 8 యూనిట్లకు, 22 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ మేడిగడ్డ పంప్ హౌజ్ లోని 11 పంపు మోటార్లకు విద్యుత్ ను అందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరం, పరిసర గ్రామాల కోసం ఎంఈఐఎల్ తాగునీటి పథకాన్ని నిర్మించింది. 70,000 కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో శుద్ధి నీటిని అందిస్తుంది. పొదలకూరు మండలం విరువూరు వద్ద పెన్నా నదిపై 3 వర్టికల్ టర్బైన్ పంప్ సెట్లను 544 కిలో వాట్ల సామర్థ్యంతో ఇన్ టేక్ వెల్ ను ఏర్పాటు చేశారు. మహమాదాపూర్ లో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని రోజుకు 122 మిలియన్ లీటర్ల సామర్థ్యం తో ఏర్పాటు చేసి నెల్లూరు నగరానికి పరిసర గ్రామాలకు నిరంతరాయంగా తాగునీటిని అందిస్తున్నది.

Comments

comments

Leave a Reply

*