టీడీపీ దొంగనోట్ల పంపిణీ.. కొట్టిన జనాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోంది. విచ్చలవిడిగా అధికార యంత్రాంగం అండదండలతో డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతోంది…

టీడీపీ జనాల చెవిలో పూలు పెడుతోంది. డబ్బుల పంపిణీ పేరులో అసలు నోట్లకు బదులు దొంగనోట్లను అంటకడుతోంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు పంచుతున్న నోట్లలో దొంగనోట్లు ఉండడం కలకలం రేపుతోంది. ఓట్లను కొనేందుకు టీడీపీ చేస్తున్న ఎత్తులు బయటపడడంతో ఓటర్లు అవాక్కవుతున్నారు.

తాజాగా కోస్తా ఆంధ్రా జిల్లాలో అసలు నోట్లలో కలిపి దొంగనోట్లను పంచుతున్న టీడీపీ నాయకులను జనాలు పట్టుకొని చితకబాదినట్టు సమాచారం. దొంగనోట్లను అంటగట్టి ఓట్లను కొల్లగొడుతారా అని జనాలు నిలదీస్తున్నట్టు తెలిసింది.

టీడీపీ గెలుపు కోసం చేస్తున్న అరాచకాలు చూసి జనం నోరెల్ల బెడుతున్నారు. ఓటర్లకు కూడా దొంగనోట్లను తెచ్చి పంచడం చూసి ముక్కునవేలేసుకుంటున్నారు. చాలా చోట్ల దొంగనోట్లను పంచుతున్న టీడీపీ నేతలను పట్టుకొని నిలదీతలు..కొట్టడాలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

Comments

comments

Leave a Reply

*