మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

గతంలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజులో విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తెలుగు సినిమా రంగంలో బాలయ్య బాబు మరియు నాగ బాబు ల మధ్య జరిగిన వివాదం గురించి మాట్లాడుతూ మెగా బ్రదర్ నాగబాబు పై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ మొత్తన్ని ఓ ఆట ఆడుకుంది శ్రీరెడ్డి. ప్ర‌జారాజ్యంతో మొద‌లుపెట్టి, జ‌న‌సేన పార్టీ వ‌ర‌కు ప‌లు కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ముఖ్యంగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడింది శ్రీరెడ్డి. ప‌వ‌న్ అంటే దొంగ కోళ్లు ప‌ట్టుకునే వాడిలా అటూ,ఇటూ చూస్తు ఉంటాడు అత‌నే క‌దా ప‌వ‌న్ అంటూ మాట్లాడింది. ఇక్క‌డ పేర్లు,అక్కడ పేర్లు చెబుతు పిచ్చి వాడిలా మాట్లాడ‌తాడని చెప్పుకొచ్చింది. పెళ్లిల మీద పెళ్లిల పెళ్లిళ్లు చేసుకుంటు , దేశ‌భ‌క్తి అని మాట్లాడతాడని.ఎలక్ష‌న్ల ముందు వ‌చ్చి ఏదేదో అనేసి, జ‌గ‌న్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు. జ‌గ‌న్ అభిమానులు ఏకం అయితే మీరు మిగ‌ల‌ర‌ని మాట్లాడింది. సమాజానికి నీతులు చెప్పే బదులు ముందు మీ జీవితాలలో వాటిని అనుసరించి ప్రజలకు చూపించండి అంటూ హిత బోధ చేసింది శ్రీ రెడ్డి.

Comments

comments

Leave a Reply

*