బాలీవుడ్ లో సంచలనం మున్నాభాయ్ 3..!

గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ సీక్వెల్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఈ సినిమాలను ఇతర భాషల్లో కూడా చాలామంది స్టార్ హీరోలు అనువదించుకుని తమకనుగుణంగా రీమేక్ చేశారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్ సినిమాల పంథాలో మరొక కొత్త సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఆ రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ మున్నాభాయ్ అప్పట్లో వెంటనే ఉంటుందని చెప్పినా.. కొన్ని కారణాల వలన సినిమా తెరకెక్కలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మున్నాభాయ్ సినిమాలకు కొనసాగింపుగా మున్నాభాయ్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అర్షద్ వర్షి చెప్పాడు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూడో పార్ట్ కు సంబంధించిన కథను రెడీ చేస్తున్నారని, ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అన్నారు. ఈ చిత్రానికి సంబందించిన కసరత్తులు సంజయ్ దత్ ప్రారంభించాడని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబందించిన హీరోయిన్, ఇతర తారాగణం గురించి అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Comments

comments

Leave a Reply

*