అసలు జీవితంలో శృంగారం లో పాల్గొనకపోతే ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా..!

సెక్స్ అనేది మానవ జీవితానికి ఎంతో అవసరం. శృంగారం వల్ల మనిషి జీవితంలో చాలా ఆరోగ్యాన్ని పొందుతారని.. చాలా పరిశోధనల్లో తేలింది అన్ని ఎంతో మంది చెబుతుంటారు. దానిని కేవలం ఒక శారీరక సుఖంలా చూసే వారు కొందరైతే.. దాని వల్ల కలిగే ఆరోగ్య లాభాల కోణంలో చూసేవారు ఇంకొందరు. సరే.. సెక్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది.. ఎన్నెన్నో లాభాలు కలుగుతాయి. మరి, జీవితంలో సెక్స్ అన్నదే చేయకుండా.. ఒకటి రెండు సార్లు చేసినా మధ్యలో ఆపేస్తే… ఏమవుతుంది..? ఎలాంటి నష్టాలు ఎదురవుతాయి..? హార్మోన్లను సమతుల్యంగా చూసుకుంటూ, సంతోషంగా సుఖపెడుతూ జీవితకాలాన్ని పెంచే శృంగారం.. మన జీవితంలో దూరమైతే.. మనం దేనికి దూరమవుతాం..? ఇవిగో అవి ఇవే అంటున్నారు శాస్త్రవేత్తలు… వాటిని ఓ సారి లుక్కేద్దాం…
ఏదైనా వస్తువును కొద్ది రోజులు వాడేసి.. ఆ తర్వాత వాడకుండా మూలకు పడేస్తే కొత్తదైనా సరే ఇబ్బందులు పెడుతుంది. అది అక్షర సత్యం. సెక్స్ జీవితంలోనూ అంతే. రస క్రీడలో పాల్గొనకుండా అలాగే ఉండిపోతే.. శరీరంలోని ‘సెక్స్ డ్రైవ్’ కూడా పనిచేయడం మానేస్తుంది. దానికి ఓ ప్రత్యామ్నాయం హస్తప్రయోగం. పదం కొంచెం అసభ్యంగా ఉంది అనుకుంటే ‘మాస్టర్బేషన్’ అనుకోండి. అయితే, దాని ప్రభావం మగవారిపైనే ఎక్కువ. మహిళలు సెక్స్ చేయకపోయినా సెక్స్ డ్రైవ్‌పై పెద్దగా ప్రభావం ఉండదట. ఉన్నా కొద్దిగా ఉంటుందట. కారణమేంటంటే.. పురుషాంగానికి సరైన వ్యాయామమన్నది లేకుంటే.. స్ఖలనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సెక్సువల్‌గా ప్రేరేపించే నరాల పనితీరు మందగిస్తుంది. అందుకే.. సెక్స్ చేయలేకపోతే కనీసం మాస్టర్బేషన్ అయినా మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు.
మహిళల విషయానికొస్తే సెక్స్ చేయకుండా ఉండిపోతే యోని గోడలు చాలా బలహీనమైపోతాయి. ఇలాంటి దుష్ప్రభావాలు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలోనే కనిపిస్తాయి. శృంగారంలో పాల్గొంటే యోనికి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. చేయకుండా ఉండిపోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగక బలహీనంగా మారి బాగా పలుచగా అయిపోతుంది. యోని పొడిబారిపోయి శృంగారంలో తృప్తి కూడా మిగలదట.
శృంగారం.. రోగ నిరోధక వ్యవస్థకు బలం. అదే లేకపోతే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం తగ్గించేస్తుందట. ప్రత్యేకించి మహిళలపై ప్రభావం పడుతుందట. పనిలో మునిగిపోవడమే కాదు.. అప్పుడప్పుడు రతి క్రీడలోనూ పాల్గొంటే మంచిదని చెబుతున్నారు. తద్వారా ఇన్‌ఫెక్షన్లు, జబ్బులు కొంచెం దూరంగా ఉంటాయన్నది శాస్త్రవేత్తల ఉవాచ.
నేటి కాలంలో యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయారు అందరూ. పనితో సతమతమవుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ ఒత్తిడి తీరాలంటే అందరితో కలిసుండడం.. కుటుంబంతో కలిసి గడపడం కొన్ని సూచనలైతే.. శృంగారం మరో ఎత్తు. ఎందుకంటే.. ఒత్తిడిని శృంగారం మటుమాయం చేసేస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒత్తిడిని దూరం చేసే హార్మన్లు విడుదలవుతాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేంటంటే.. శృంగారం చేయకపోతే ఒత్తిడి తలకెక్కి కూర్చుంటుంది. సెక్స్ అటకెక్కితే.. ఒత్తిడి తలెక్కుతుందన్నది వారి మాట.
సెక్స్ చేయకుండా ఉండిపోతే యోని గోడలు బిగుసుకుపోతాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ, అది నిజం కాదంటున్నారు. దానికీ..దీనికీ సంబంధమే లేదంటున్నారు. ఎంతో మందితో సెక్స్ చేశాం.. ఎన్ని సార్లు చేశామన్నది కాదంటున్నారు. సెక్స్ నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన ‘కన్నె పిల్లలు’గా ఉంటారన్నది వట్టి అపోహ అని ఉద్బోధిస్తున్నారు. కాకపోతే.. శృంగారంలో పాల్గొనకపోతే.. యోని కణజాలాలు మాత్రం అలవాటు తప్పి కాస్తంత ఇబ్బంది పెట్టడం నిజమే అయినా పైవన్నీ వట్టి మాటలేనంటున్నారు.
ఎప్పటినుంచో గుండె ఆరోగ్యానికి.. సెక్స్ జీవితానికి లంకెలు వేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె పదిలంగా ఉండేందుకు సెక్స్ దోహదం చేస్తుందంటారు. శృంగార జీవితానికి దూరమైతే.. గుండె ఆరోగ్యానికి అవసరమయ్యే హార్మోన్లూ దూరమవుతాయి. అంటే.. గుండెని మంచిగా కాచుకునే హార్మోన్లు శరీరంలో విడుదల కావన్నమాట. తద్వారా.. గుండెకి చేటే కదా.
చివరగా.. సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే ఒక్క మేలు.. మూత్రాశయ, సుఖ వ్యాధులు దూరంగా ఉండడం. అవును, సెక్స్ నుంచి దూరంగా ఉంటే సుఖ వ్యాధులు దరిచేరవు. అంతేగాకుండా.. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లూ మనవైపు తొంగి చూడవు. అదొక్క ప్రయోజనం మినహాయించి.. చాలా నష్టాలే ఎదురవుతాయన్నది శాస్త్రవేత్తల మాట.

Comments

comments

Leave a Reply

*