జై లవ కుశ .. ఇంటర్నెట్ లో మొట్ట మొదటి రివ్యూ :

ఇండియా లో ఇంకా విడుదల అవ్వని జై లవ కుశ మూవీ కి సంబందించిన రివ్యూ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇండియన్ సినిమాలకి ఒక రోజు ముందుగానే రివ్యూ లు ప్రకటించే ఉమైర్ సంధూ ఇప్పుడు జై లవకుశ కి సంబంధించి కూడా తన సైడ్ నుంచి రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు . ఎన్టీఆర్ ఫాన్స్ కి సూపర్ విందు అనీ డైరెక్టర్ బాబీ సినిమాని కామెడీ , సీరియస్ యాంగిల్స్ లో బాగా మౌల్ద్ చేసాడు అంటున్నారు వారు. మాస్ ఎలిమెంట్ ల విషయం లో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటుంది అన్నాడు ఉమైర్ సంధూ. క్లిమక్స్ ఫైట్ కూడా బాగా పాజిటివ్ గా వచ్చింది అన్నాడు అతను. రాశీఖన్నా, నివేదా థామస్ లు ఆకట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఎప్పట్లానే డాన్సులు ఇరగదీశాడని, ఆయన ఫైట్స్ కు కూడా అభిమానులు ఫిదా అవుతారని ఆయన చెప్పారు. ఎడిటింగ్ విషయం లో మాత్రమె కాస్త నెగెటివ్ మార్క్స్ పడతాయి అనీ , కొన్ని సీన్ లలో ఎక్కువ డ్రాగ్ ఉంది అన్నారు ఉమైర్.

Comments

comments

Leave a Reply

*