పవన్ కళ్యాణ్ పై సంచలన సెటైర్లు వేసిన హైపర్ ఆది..!

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరపున తెలుగు కామెడీ షో జబర్దస్త్ యాక్టర్ హాస్యనటుడు హైపర్ ఆది ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆది కూడా పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.2009 లో ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ముంచేసారని కానీ ఇప్పుడు వచ్చింది మొండి వ్యక్తని అలాంటి పవన్ ని ముంచడం ఉండదు తాడో పేడో తేల్చుకోడమే ఉంటుందని చెప్పారు.పవన్ లాంటి మంచి వ్యక్తికి ప్రతీ ఒక్కరు అండగా నిలబడాలని అందుకే తాను కూడా వచ్చానని తెలిపారు.పవన్ కి ఎలక్షన్ అయినా కలెక్షన్ అయినా ఒకటే అని ఆ రెండింటిలోనూ రికార్డులు బద్దలవుతాయని హితవు పలికారు.కులాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు గుండె పై చెయ్యేసి ఉన్న ముగ్గురులో ప్రతీ ఒక్కరికి ఎవరు మంచి చేస్తారో వారికే ఓట్ వెయ్యండని తెలిపారు.

Leave a Reply

*