జహీర్ ఖాన్ పెళ్ళికి అంతా సిద్ధం .. ఆ హీరోయిన్ తోనే

ఇండియా లో క్రికెట్ చూసే అందరికీ జహీర్ ఖాన్ తెలిసే ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ గా ఇండియా కి అనేక విజయాలు అందించిన జహీర్ వరల్డ్ కప్ గెలుచుకున్న టీం లో లేకపోవడం మాత్రం చాలామందికి అసహనాన్ని అందించింది. ఎప్పటి నుంచో ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్న మనోడు ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చెక్ దే ఇండియా సినిమాలో నటించిన సాగరిక ఘట్కే తో జహీర్ ఖాన్ ఒకటి కాబోతున్నాడు . రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్రికెటర్ జహీర్ ఖాన్ తనకి ప్రొపోజ్ చేసాడు అని ప్రొపోజ్ చేసిన విధానం తో సహా అన్నీ చెప్పింది సాగరిక. వీరిద్దరి పెళ్ళీ ఈ ఏడాది నవంబర్ 27 న ఫిక్స్ చేసారు. యువరాజ్ సింగ్ పెళ్లి లో కూడా వీరిద్దరూ జంటగా రావడం నేషనల్ మీడియా లో న్యూస్ గా మారింది. త‌ర్వాత ఈ ప్రేమ జంట‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో కూడా పోస్ట్ చేశారు. ఏదేమైనా మ‌రో సినీ తార – క్రికెట‌ర్ వివాహం స్ప‌ష్టం కావ‌డంతో అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here