” బాలయ్య కొట్టినా తిట్టినా మాకు పర్లేదు .. అమ్మ ప్రేమ బాలయ్య ప్రేమ ఒక్కటే ” – ఫాన్స్

ఫాన్స్ అందు బాలయ్య బాబు ఫాన్స్ వేరయా అని నానుడి రాసుకోవాలి ఏమో , ఎందుకంటే బాలయ్య తమని పర్సనల్ గా కలిసినప్పుడు డిప్పమీద రెండు కొట్టినా, హీరోయిన్ ల గురించి తేడాగా మాట్లాడినా కూడా ఎప్పుడూ ఎక్కడా రియాక్ట్ అవ్వరు అతను అభిమానులు. బాలయ్య మీద తమ ప్రేమ ఎప్పటికీ చావదు అనే వారు ప్రకటిస్తారు ఓపెన్ గా. బాలయ్య కొత్త సినిమా పైసా వసూల్ విడుదల అయ్యి థియేటర్ లలో హల్చల్ చేస్తోంది. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ కొట్టి సెకండ్ హాఫ్ డల్ గా ఉన్న ఈ చిత్రం మీద బాలయ్య ఫాన్స్ చాలానే హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా బాలయ్య ఫాన్స్ అంటించిన ఫెక్స్ ల మీద బాలయ్య తమని కొట్టినా పర్లేదు అంటూ ఫాన్స్ రాయడం గమనార్హం. అమ్మ తిట్టింద‌ని అమ్మ మీద ప్రేమ‌.. బాల‌య్య బాబు తిట్టాడ‌ని ఆయ‌న మీద అభిమానం ఎప్ప‌టికీ చెరిగిపోవు.. జై బాల‌య్య.. జై జై బాల‌య్య’ అని అభిమానులు రాసుకొచ్చారు. ఈ ఫ్లెక్స్ ల ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here