ప్రభాస్ కోసం బతుకుతున్నా .. అతన్నే పెళ్లి చేసుకుంటా ..

బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ప్రభాస్ ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బాహుబలి 1 కి ప్రభాస్ ని చూసి మంచి నటుడు అనుకున్న నార్త్ జనాలు బాహుబలి 2 టైం కి అక్కడ ఫాన్స్ గా మారిపోయారు కూడా. ప్రభాస్ ఫాన్ ఫాలోయింగ్ లో నార్త్ ఇండియా లో ఎక్కువగా అమ్మాయిలే ఉండడం విశేషం. అయితే ప్రభాస్ ఫాన్ ని అంటూ కలకత్తా కి చెందిన ఒక అమ్మాయి ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. ప్రభాస్ ని పెళ్లి చేసుకునేంత ఇష్టం అని చెబుతున్న సుభద్ర ముఖర్జీ ప్రభాస్ పుట్టిన రోజున హైదరాబాద్ కి రావడానికి సిద్దం అయ్యింది. దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ప్రభాస్ కోసం ఒక బాహుబలి విగ్రహం కూడా సిద్దం చేసింది ఆమె. ప్రభాస్ ని కలిసే ఛాన్స్ తనకి వస్తుంది అనీ ఆమె పీయే తనని కలిపిస్తాడు అని చెప్పింది సుభద్ర. ప్ర‌ముఖ గాయని ఉషా ఉతుప్‌తో ప్రభాస్‌పై నాలుగు పాటలు కూడా పాడించింది సుభద్ర. వృత్తి రిత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన సుభద్ర పెళ్ళంటూ చేసుకుంటే ప్రభాస్ నే చేసుకుంటాను అనీ లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here