సినిమా రివ్యూ : పైసా వసూల్ -ఇది బాలయ్య విశ్వరూపం

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రీయ శరణ్, ముస్కాన్, కైరా దత్, కబీర్ బేడి, ఆలి, పృధ్వి, విక్రం జీత్

సంగీతం : అనూప్ రూబెన్స్

కెమెరామన్ : డి.ముఖేష్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాధ్

నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్

నందమూరి బాలకృష్ణ శాతకర్ణి తర్వాత చేసిన సినిమా పైసా వసూల్. పూరి జగన్నాధ్ డైరక్షన్ లో బాలయ్య మూవీ ఎవరు ఊహించి ఉండరు. అలాంటిది ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది చూసేద్దాం.

కథ :

తేడా సింగ్ (బాలకృష్ణ) తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ తో ఎలాంటి వారితో అయినా సరే తలపడుతుంటాడు. తనలోని ఈ డేరింగ్ ఎఫర్ట్ వల్ల చాలా విషయాల్లో తెలియకుండా కొందరికి హెల్ప్ అవుతుంటాడు. ఇక ఇదే సమయంలో బాబ్ మార్లో అనే ఇంటర్నేషన్ డాన్ కు చెక్ పెట్టేయాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనుకుంటుంది. ఇక ఈ టాస్క్ కోసం సరైన వ్యక్తిని వెతుకుతుండగా వారికి తేడా సింగ్ కనిపిస్తాడు. తేడా సింగ్ ఆ డాన్ ను పట్టుకునే డీల్ ఒప్పుకున్నాడా..? ఇంతకీ ఈ తేడా సింగ్ కథ ఏంటి..? అతను ఎందుకు అలా రెక్లెస్ గా తయారయ్యాడు..? అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో తేడా సింగ్ ఆ నటించిన బాలయ్యకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. పూరి సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాని 57 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా తన నటనని చూపించారు. కచ్చితంగా ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపాన్ని చూడొచ్చు. సీనియర్ హీరోలంతా ఒకేరకమైన పాత్రలకు అంకితమవుతుంటే బాలయ్య మాత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమాలు తీస్తున్నాడు. ఆ క్రమంలోనే శాతకర్ణిగా మెప్పించి ఇప్పుడు పైసా వసూల్ గా తేడా సింగ్ అంటూ అదరగొట్టాడు. సినిమా మొత్తం బాలయ్య వంటి చేత్తో నడిపించాడు. ఇక హీరోయిన్ శ్రీయ పర్వాలేదు అనిపించగా.. కైరా దత్, మస్కన్ ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు కనిపించారు. ఇక కబీర్ బేడీ, విక్రం జీత్ లు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం :

దర్శకుడు పూరి ఈ సినిమాను మలిచిన తీరు కథ కన్నా కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టాడని అనిపిస్తుంది. పూరి సినిమాల్లో కథనం చాలా వేగంగా ఉంటుంది. అయితే ఈమధ్య అది మిస్సయ్యే చేదు అనుభవాలను ఫేస్ చేశాడు. ఇక ఈ సినిమా కథ కథనాల్లో పూరి మార్క్ కనిపిస్తుంది. కచ్చితంగా ఇది బాలయ్యకు మరో పోకిరి సినిమా అని చెప్పేయొచ్చు. అనూప్ మ్యూజిక్ అదరగొట్టాడు. సినిమాకు ఎలాంటి సాంగ్స్ కావాలో అలానే ఇచ్చాడు. రీ రికార్డింగ్ లో కూడా అనూప్ తన టాలెంట్ చూపించాడు. ఇక బాలయ్య పాడిన ఏక్ పెగ్ లావో సాంగ్ డ్యాన్స్ లో కూడా ఊపుతెచ్చాడు. ఇక సినిమాటోగ్రఫీ ముఖేష్ కూడా పర్వాలేదు అనిపించాడు. ఇక ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

విశ్లేషణ :

బాలయ్యను ఇలాంటి పోకిరి రోల్ లో చూపించే సత్తా కేవలం పూరికి మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు. సినిమా కథ అంతగా కొత్తగా అనిపించకపోయినా కథనంలో మాత్రం ఈసారి పూరి లెక్క తప్పలేదని చెప్పొచ్చు. శాతకర్ణి తర్వాత బాలయ్య పైసా వసూల్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే సినిమా ఇది ఫిక్స్.

బాలయ్య ఎనర్జీ సినిమాకు అదనపు ఆకర్షణ. కథనంలో వేగం ఉన్నా అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమా కథ కథనాలు మహేష్ తో తీసిన పోకిరి లానే నడుస్తున్నట్టు అనిపిస్తాయి. కామెడీని ట్రై చేసినా అంతగా వర్క్ అవుట్ కాలేదు. బాలయ్య డైలాగ్ డైలివరీలో కొత్తగా ప్రయత్నించిన పూరి కొంతమేరకు సక్సెస్ అయినట్టే.

అనుకున్న కథను అనుకున్న విధంగా తెరకెక్కించిన పూరి పైసా వసూల్ ను పక్కా పైసా వసూల్ మూవీగానే తెరకెక్కించాడు. ముఖ్యంగా నందమూరి అభిమానులకు మాత్రం ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. సగటు సిని ప్రేమికుడు బాలయ్యను ఇప్పటివరకు చూడని పాత్రలో చూసి ఎంజాయ్ చేస్తారు.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య నటన, స్క్రీన్ ప్రెజెన్స్

మ్యూజిక్

పూరి టేకింగ్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథగానే అనిపించడం

కొత్తదనం లేకపోవడం

బాటం లైన్ :

స్టైలిష్ బాలయ్య విశ్వరూపం ‘పైసా వసూల్’..!

రేటింగ్ : 3/5

English : >> Balakrishna’s Paisa Vasool Movie Review and Rating

Paisa Vasool Movie Review, Paisa Vasool Movie Rating, Paisa Vasool Review, Paisa Vasool Rating, Balakrishna Paisa Vasool Review,Paisa Vasool Collactions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here