కామపిశాచుల పైశాచికం.. బాలికను ఎత్తుకెళ్లి పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి

జార్ఖండ్‌లో దారుణ ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్తున్న మైనర్ బాలిక బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు కామాంధులు ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గిరిదిహ్ జిల్లాలోని తిసారీ పోలీస్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 19వ తేదీన బహిర్భూమి కోసం సమీపంలోని నదీ తీరానికి ఒంటరిగా వెళ్తోంది. ఆమెను గమనించిన ఇద్దరు యువకులు బాలికను బెదిరించి బైక్‌పై ఎక్కించుకుని ఓ ఇంటికి తీసుకెళ్లారు.

Also Read:

అక్కడ బాలికను బంధించిన ఇద్దరు యువకులు అనేకసార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వగా.. వారు దాన్ని పంచాయతీలో పరిష్కరించేందుకు యత్నించారు. నిందితుల నుంచి ఎంతో కొంత మొత్తం అందేలా చూస్తామని, పోలీస్ కేసు పెట్టొద్దని పెద్దలు వారిని హెచ్చరించారు. అయితే తన జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులను విడిచిపెట్టకూడదని భావించిన బాధితురాలు మంగళవారం తిసారీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here