స‌న్నీలియోన్ కండో యాడ్ హోర్డింగ్ కు 15మంది పోలీసుల భ‌ద్రత‌

అసాంఘిక శ‌క్తుల్ని నుంచి స‌మాజాన్ని కాపాడే పోలీసులు కండోయాడ్ హోర్డింగ్ కు ర‌క్ష‌ణగా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మానదు. స‌న్నిలియోన్ శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్ చెలామ‌ణి అవుతు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతుంది. దీపం ఉండ‌గా ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న సామెతను బాగా ఫాలో అయ్యింది. అందుకే సినిమాల్లో, యాడ్ల‌లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా యాక్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. అయితే ఈ మ‌ధ్య స‌న్ని గ‌ర్భా డాన్స్ తో పోలుస్తూ  ఓ కండోమ్ యాడ్ లో యాక్ట్ చేసింది.  ఈ యాడ్ పోస్ట‌ర్ల‌ను ప‌లు ప్రాంతాల్లో బ‌హిరంగంగా అతికించి హోర్డింగ్స్ పెట్టారు. ఈ హోర్డింగ్ పై గుజరాత్‌‌లోని సూరత్ వాసులు మండిప‌డుతున్నారు.  దసరా ఉత్సవాలు జ‌రుగనున్న నేప‌థ్యంలో ఈ కండోమ్ యాడ్ అస‌భ్యంగా , యువ‌కుల్ని రెచ్చ‌గొట్టేలా ఉందంటూ స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హోర్డింగ్స్ ను ప‌డ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కండోమ్ యాడ్ హోర్డింగ్ కు ర‌క్ష‌ణ‌గా కాప‌లా కాస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here