స్టార్ మాటీవి నిర్వహిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ . ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ కావడంతో అంచనాలు పెరిగాయి. షో ప్రారంభంలో రేటింగ్స్ ఫర్వాలేదనిపించిన రానురాను అభిమానులకి మరింత అసహనాన్ని తెచ్చిపెట్టేలా చేసింది. దానికి కారణం ఎన్టీఆర్ శనివారం, ఆదివారాల్లో మాత్రమే యాంకర్ గా వ్యవహరించడమే. మరి మిగిలిన రోజుల్లో షో ఆసాంతం తన ఉనికిని చాటుకోలేక బోర్ కొట్టే విధంగా ఉందని కొంతమంది అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.
అయితే ఈ షో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ఎన్టీఆర్ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు.
మరి షో రేటింగ్స్ గురించి, అభిమానుల పల్స్ పై మాట్లాడిన ఎన్టీఆర్ ఓ సందర్భంలో స్టార్ మాటీవీపై అసహనం వ్యక్తం చేశాడు. రేటింగ్స్ కోసం యాజమాన్యం సిల్లీట్రిక్స్ ప్లే చేయడం. హౌజ్ మేట్స్ మధ్య ఘర్షణలను క్రియేట్ చేసి అభిమానుల్ని తనవైపుకు తిప్పుకోవడం. ఈ పద్దతిని తప్పు బట్టిన ఎన్టీఆర్ హిందీ బిగ్ బాస్ వేరు, తమిళ బిగ్ బాస్ వేరు… కలహాలు మన కల్చర్ కాదు, మన స్టయిల్ మనదే అని చెప్పుకొచ్చాడు. మరి బిగ్ బాస్ షో మరింత క్లిక్ అవ్వాలంటే ఏం చేయాలో అది చేస్తే ప్రేక్షకాదరణ ఉంటుందని క్రిటిక్స్ అభిప్రాయడుతున్నారు.
ఎలాగోలా ఫస్ట్ సీజన్ ఓ కొలిక్కి వచ్చేసినట్టే… మరి తదుపరి సీజన్..? తన ఆలోచనల్ని స్టార్ మాటీవీ మార్చుకుంటే బాగుంటుందని ఎన్టీఆర్ సూచించాడట. లేదంటే ఎన్టీఆర్ తప్పుకోవడం ఖాయమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ కాబట్టే షోరేటింగ్స్ బాగున్నాయని సందర్భాన్ని బట్టి స్పాంటేనిఎస్ గా వ్యవహరిస్తూ జూనియర్ తనదైన శైలిలో నెట్టుకొస్తున్నాడు.
నిజానికి ఈ బిగ్ బాస్ షోలో జూనియర్ సక్సెస్ అవుతాడా..? తను కూడా ఎంతసేపూ ఈ ఆర్టిఫిషియాలిటీ నమ్ముకుంటాడా అనుకున్నారు… కానీ, జూనియర్ ఈ షోకు తగినట్టు అద్భుతంగా అడాప్ట్ అయిపోయాడు… మరి రెండో సీజన్..?!
