లక్ష్మీరాయ్ కి ధోనీ ఎవరో తెలియదంట

ఐటం సాంగుల్లో తళక్కున మెరిసే లక్ష్మీరాయ్ బాలీవుడ్ లో పాగా వేసింది. ప్రస్తుతం ‘జూలీ 2’ సినిమాలో హీరోయిన్ అవతారం ఎత్తింది. అయితే లక్ష్మీరాయ్ కి తన మాజీ ప్రియుడు, ధోనీ ఎవరో తెలియదని అంటుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఐటం భామని ధోని గురించి అడగ్గా అతనెవరో నాకు తెలియదు. అతను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉన్నాడు. మీరే మా ఇద్దరి మద్య ఏదో జరుగుతుందని ప్రచారం చేశారు. మీరు ఊహించేవి ఏమీ ఇప్పుడు జరగవు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి ముందుకు వెళితే మంచిది. డేటింగ్ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదనుకున్నా  ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా. ధోనీని నేను ఇప్పటికీ గౌరవిస్తున్నా’ అని లక్ష్మీరాయ్ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here