శింబు – హన్సికల పెళ్లి ఎందుకు పెటాకులైందో చెప్పిన శింబు తండ్రి

తమిళ హీరో శింబు..! పరిచయం అక్కర్లేని పేరు సినిమాలకంటే ఆయనపై వచ్చిన రూమర్లే ఎక్కువ. వరుస సినిమాల హిట్లతో జోరుమీదున్న శింబు కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు హీరో్యిన్ నయనతార తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. వీరద్దరు కలిసి నటించిన వల్లభ సినిమా సమయంలో కెమిస్ట్రీ వర్కౌట్ అయి ప్రేమకు దారితీసింది. అంతే కాదు వీరిద్దరికి సంబంధించిన కొన్ని  ప్రైవేట్ ఫోటోస్ వెలుగులోకి రావడంతో వీళ్లిద్దరు పెళ్లి పీఠలెక్కడం ఖాయమనుకున్నారు. కానీ వీరిద్దరు విడిపోవడం. నయన్ ప్రభుదేవాతో సన్నిహితంగా ఉండటం..శింబు హన్సికతో ప్రేమలో పడడం అంతా విచిత్రంగా జరిగింది. అయితే ఇప్పుడైన శింబు – హన్సికను పెళ్లి చేసుకుంటారని అందరు ఊహించుకున్నారు. అప్పుడే శింబు, హన్సిక ల పెళ్లి రద్దైందని కోలివుడ్ మీడియా కోడై కూసింది. దీనికి కారణం హన్సికేనని శింబు తండ్రి టీ. రాజేందర్ స్పష్టం చేశాడు.
ఎలా తన తల్లి వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉందో…హన్సిక కూడా సినిమాలకు దూరంగా ఉండాలని శింబు హన్సికను కోరాడట. ఈ షరతు నచ్చని హన్సిక శింబును పెళ్లి చేసుకునేందుకు ఒప్పులేదంట. అందుకే శింబు- హన్సికల పెళ్లి జరగలేదని  రాజేందర్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే తనకొడుకు శింబు పెళ్లి చేసుకోనున్నట్లు.. పెళ్లి గురించి ప్రకటన చేస్తానని రాజేందర్ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here