జనసేన భవిష్యత్తు , పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి ఎన్టీఆర్ అభిప్రాయం , ఓపెన్ గా చెప్పేసాడు

తన సినిమా జై లవ కుశ ప్రమోషన్ లలో బిజీ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి అనేక ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. సినిమా ప్రమోషన్ అనగానే సినిమాకి సంబందించిన ప్రశ్నలు మాత్రమె అడగాలి కానీ మనవాళ్ళు వెరైటీ గా అన్నీ అడిగేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీగా దొరకరు కాబట్ట్టి దొరికిన టైం లోనే అనేక కాంట్రవర్సీ లు లాగాలి అనేది వారి ఆలోచన. రీసెంట్ గా ఇలాంటి ప్రశ్న ఒకటి ఎన్టీఆర్ కి వచ్చింది. జన సేన పార్టీ గురించీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ గురించీ మీరు ఏమనుకుంటున్నారు అంటూ ఎన్టీఆర్ ని డైరెక్ట్ గా అడిగేశారు . అయితే దేనికి ఎన్టీఆర్ చాలా లౌక్యం తో సమాధానం చెప్పాడు . ” నాకు ఒక పార్టీ పట్ల కానీ ఒక రాజకీయ నేత పట్ల కానీ నిశ్చితమైన ఆలోచన , అభిప్రాయం ఏమీ లేవు. ఒక భారతీయుడు గా ఎన్ని పార్టీ లు ఉన్నా ఏ పార్టీ గెలిచినా కూడా ఆ పార్టీ జనాలకి మంచి చెయ్యాలనే కోరుకుంటాను ” అన్నాడు ఎన్టీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here