ఎక్స్ క్లూజివ్ : స్పైడర్ సెన్సార్ టాక్

స్పైడర్ సినిమా ఈ నెల 27 న విడుదల కి సిద్ధం అవుతోంది. ఈ సినిమా కోసం ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ తో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తి అయ్యింది. యూ బై ఏ సాధించిన ఈ సినిమా సెన్సార్ ఎక్కడా కట్ లేకుండా సాగింది. మన వెబ్సైటు కి సెన్సార్ బోర్డు నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రక్రారం చూస్తే స్పైడర్ సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగుతూ లవ్ స్టోరీ కాస్త డల్ గా వెళుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో సూర్య – మహేష్ ల మధ్యన వచ్చే సీన్ లు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి అనీ అద్భుతమైన ఇంటర్వల్ బ్యాంగ్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది అనీ అంటునారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సెన్సేషనల్ గా ఉందట. మహేష్ చేజింగ్ సీన్ లూ యాక్షన్ సీన్ లూ ఫైట్ ఎపిసోడ్ లూ అన్నీ కుమ్మేసాడు అని టాక్. మహేష్ బాబు ఎన్నడూ లేనంతా చురుకుగా అందంగా ఈ సినిమాలో కనిపిస్తాడట. ఏదేమైనా మహేష్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరికీ సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది అంటున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here