చదువు చెప్పే క్లాసులో స్టూడెంట్ ని గ్యాంగ్ రేప్ చేసిన టీచర్లు .. స్టూడెంట్ కి కడుపు

కొన్ని కొన్ని సంఘటనల గురించి విన్నా చదివినా రక్తం ఉడికిపోతుంది. అలాంటి సంఘటనే ఇది కూడా. రాజస్థాన్ లోని షహర్ పురా లో దారుణం జరిగింది. మంచి విద్యా బుద్ధులు నేర్పాల్సిన కళాశాల డైరెక్టర్ , లెక్చరర్ ఇద్దరూ తమ స్టూడెంట్ ని చదువు చెప్పే క్లాస్ రూమ్ లోనే గ్యాంగ్ రేప్ చేసారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆమెకి కడుపు వచ్చేదాకా చేసారు వాళ్ళు. స్థానికంగా నివాసం ఉండే వనిత (పేరు మార్చాం) అనే యువతి వీరిద్దరూ ఉండే కాలేజీ లో చదువుకుంటోంది. ఆదివారం నాడు స్పెషల్ క్లాసులు అంటూ ఆమెని పిలిపించి గ్యాంగ్ రేప్ చేసేవారు వీరు. ఎవరికైనా చెప్తే చంపుతాం అంటూ బెదిరించారు. ఆమెకి నెమ్మదిగా కడుపు రావడం తో అబార్షన్ కోసం తెలిసిన డాక్టర్ లని కన్సల్ట్ చేసారు. ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి, ఆమె పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల డైరెక్టర్, లెక్చరర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here