నిహారిక – సాయి ధరం తేజాల మధ్యన ఏం నడుస్తోంది .. ఓపెన్ గా చెప్పేసిన నాగబాబు

మెగా ఫామిలీ కి సంబందించిన ఏ విషయం అయినా సరే నాగబాబు చాలా డీప్ గా ఈ మధ్య ఓపెన్ అవుతున్నారు. ఒకప్పుడు మీడియా కి పూర్తిగా దూరంగా ఉంటూ వారు ఇంటర్వ్యూ లకి పిలిచినా వచ్చేవారు కాదు నాగబాబు. జబర్దస్త్ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే ఆయన జనాలతో మమేకం అవుతూ అనేక విషయాలు షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మీడియా లో ఆయన కూతురు నిహారిక , ఆయన మేనల్లుడు సాయి ధరం తేజ లకి సంబందించిన ఒక వార్త సంచలనం అయిన సంగతి తెలిసిందే, దీని గురించి మాట్లాడిన నాగబాబు అలాంటి రాతలు రాసేవాడిని ‘ దరిద్రుడు ‘ అంటూ సంబోధించారు. సాయి ధరం తేజ , నిహారిక లవ్ చేసుకుంటున్నారు అనీ పేరెంట్స్ కూడా వారి పెళ్ళికి ఒప్పుకున్నారు అనేది ఆ వార్త సారాంశం ఆ వార్త కొన్నాళ్ళకి సోషల్ మీడియా లో దావానం లాగా వ్యాపించింది .  ఆ విషయాన్ని గురించి తాజాగా నాగబాబు స్పందిస్తూ, అదొక ఫూలిష్ న్యూస్ అని అన్నారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పారు. ” అసలు వాళ్ళిద్దరినీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, వారు అన్నా చెల్లెళ్ళు లాగా ఉంటారు ” అంటూ నాగబాబు ఈ వివాదానికి ముగింపు పలికారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here