అల్లూ అర్జున్ ని ఆ విషయం లో ఎవ్వరూ బీట్ చెయ్యలేరు .. – ఎన్టీఆర్

ఈ మధ్య కాలం లో సినిమా విడుదల కంటే ముందర హీరోలు అందరూ ప్రమోషన్ లలో యమా బిజీ అయిపోతున్నారు. తమ సినిమాలు తామే ప్రోమోట్ చేసుకునే కల్చర్ ఇదివరకు లేని ఈ హీరోలు ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ తన జై లవ కుశ కోసం ప్రమోషన్ లు మొదలు పెట్టాడు. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ అనేక విషయాలుషేర్ చేసుకున్నాడు. ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఇండస్ట్రీ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అనే అడిగిన ప్రశ్నకి గాను అల్లూ అర్జున్ అంటూ సమాధానం ఇచ్చాడు ఎన్టీఆర్ . మెగా , నందమూరి ఫామిలీల మధ్యన ఉండే వైరం సంగతి అందరికీ తెలిసిందే అయినా కానీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా అల్లూ అర్జున్ పేరు చెప్పి అందరి మనసులూ గెలుచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జై లవ కుశ లో మూడు పాత్రల్లో కనిపించబోతున్న జూనియర్ మూడు పాత్రల వేరియేషన్ లూ బాగా వచ్చాయి అంటున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here