షాకింగ్‌.. కుటుంబంలో 18 మందికి క‌రోనా అంటించిన ప్రబుద్ధుడు

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని ప్ర‌భుత్వం ఎంత‌గా చెబుతున్న కొంత‌మంది నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంత్ క‌బీర్‌న‌గ‌ర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. త‌న కుటుంబంలోని ఏకంగా 18 మందికి ఒక ప్ర‌బుద్ధుడు క‌రోనా వైర‌స్ అంటించాడు. జిల్లాలోని మ‌ఘ‌ర్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఒక వ్య‌క్తికి క‌రోనా సోకింది. అయితే త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌, నిర్ల‌క్ష్యంగా ప్ర‌వర్తించ‌డంతో అత‌ని కుటుంబంలోని 18 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా తేలారు.

Must Read:

నిజానికి క‌రోనా అని తేల‌గానే అత‌ను ఎవ‌రెవ‌రిని క‌లిశాడో అధికారులు ఆరా తీశారు. ఈ నేప‌థ్యంలో మ‌ఘ‌ర్‌, తిలాతి ప్రాంతానికి చెందిన 27 మంది నుంచి క‌రోనా న‌మూనాల‌ను సేక‌రించిన అధికారులు గోర‌ఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడిక‌ల్ క‌ళాశాల‌కు పంపించారు. వీరిలో 18 మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌ని తేల్చారు. వెంట‌నే వారందరిని క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు.

Must Read:

తాజాగా భారీమొత్తంలో క‌రోనా కేసులు వెలుగు చూడ‌ట‌తో జిల్లా మేజిస్ట్రేట్ ర‌వీశ్ గుప్తా ఈ రెండు ప్రాంతాల‌ను హాట్‌స్పాట్ కేంద్రాలుగా ప్ర‌క‌టించారు. ఈ ప్రాంతాల‌లో లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌డం కోసం పోలీసు బ‌ల‌గాల‌ను దింపారు. మ‌రోవైపు జిల్లా స‌రిహ‌ద్దుల‌ను మూసి, ఈ ప్రాంతాల‌పై నిఘా వేయాల‌ని అధికారులను గోర‌ఖ్‌పూర్ జోన్ క‌మిష‌న‌ర్ జ‌యంత్ నార్లీక‌ర్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here