స్టార్ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం.. 26 మంది విదేశీ మహిళలు అరెస్ట్

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఆ మహమ్మారిని ఎదుర్కోవాలంటే మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మలేషియాలో మాత్రం వ్యభిచార దందా నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా సోకుతుందన్న ఆందోళన లేకుండా నిర్వాహకులు అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. రాజధాని కౌలాలంపూర్‌లోని పుడు ప్రాంతంలోని ఓ హోటల్‌లో జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం(ఏప్రిల్ 23) మధ్యాహ్న సమయంలో పోలీసులు అక్కడ రైడ్ నిర్వహించారు.

Also Read:

ఈ సందర్భంగా 26 మంది విదేశీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 25-40 మధ్య వయసు కలిగిన 23 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ వేర్వేరు గదిలో ఉంటూ విటుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పట్టుబడ్డారు. వీరితో పాటు ఐదుగురు విటులను కూడా అరెస్ట్ చేశారు. గదుల్లో నగదు, సెల్‌ఫోన్లతో పాటు భారీగా కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది మహిళలు టూరిస్ట్ వీసాలపై కౌలాలంపూర్ వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన పత్రాలు లేని మరో ముగ్గురు మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read:

ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముగ్గురు స్థానిక వ్యక్తులకు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా మహిళల నగ్న ఫోటోలతో ఆన్‌లైన్లో ప్రకటనలు గుప్పించి విటులను ఆకర్షి్స్తున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి గంటకు 180-300 రిగ్గిట్స్(మలేషియన్ కరెన్సీ) వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ విదేశీ మహిళలందరినీ సెమెనిహ్‌‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించిన పోలీసులు వారిని కోవిడ్-19 స్క్రీనింగ్‌కు పంపించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here