ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని దారుణంగా చంపి మృతదేహాన్ని..

ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. ప్రియురాలిని గొంతుపిసికి దారుణంగా చంపేసి పొలాల్లో పడేశాడు. బయటికెళ్లిన కూతురు ఎంతకీ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్థులతో కలసి వెతకడంతో శవమై కనిపించింది. ఈ అమానుష ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

ఏళ్ల తరబడి వెంటపడుతున్నా పట్టించుకోవడం లేదన్న కోపంతో చెప్పినందుకు ఉన్మాదిగా మారిన యువకుడు ఏకంగా ప్రియురాలిని దారుణంగా చంపేసిన ఘటన ఫిరోజాబాద్‌లో జరిగింది. గ్రామానికి చెందిన యువతి(18) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన పవన్(25) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఆమె కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో వెంటపడేవాడు. అయినా ఆమె పట్టించుకోలేదు.

Also Read:

లాక్‌డౌన్ కారణంగా యువతి ఇంటి వద్దే ఉంటోంది. కుటుంబ సభ్యులు పొలంలో గోధుమ నూర్పిడి పనుల్లో ఉండడంతో వారికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. భోజనం ఇచ్చి తిరిగి వస్తున్న సమయంలో పవన్ ఆమెను అడ్డుకున్నాడు. చాలా రోజులుగా వెంటపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమెతో గొడవకు దిగాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించడంతో పాటు గొడవ చేస్తే తల్లిదండ్రులకు విషయం చెబుతానని హెచ్చరించింది.

ప్రేమను ఒప్పుకోకపోవడమే కాకుండా పేరెంట్స్‌కి చెబుతానని హెచ్చరించడంతో ఆగ్రహం చెందిన పవన్.. ఆమె గొంతునులిమి చంపేశాడు. ఊపిరాడకుండా చేసి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేశాడు. భోజనం ఇచ్చేందుకు పొలానికి వచ్చిన కూతురు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలసి వెతకడం ప్రారంభించారు.

Read Also:

ఆ విషయం తెలుసుకున్న ప్రేమోన్మాది ఆమె శవాన్ని పొలాల్లో దాచేందుకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బయటికి వెళ్లాడు. అతనిని గమనించిన గ్రామస్థులు వెంబడించడంతో అసలు విషయం బయటపడింది. యువతిని హత్య చేసి పొలాల్లో పడేసినట్లు గుర్తించారు. ప్రేమోన్మాదిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here