భయపెడుతున్న సూపర్ స్ప్రెడర్స్.. ఆ 38 మంది వల్లే పంజాబ్‌లో పెరుగుతున్న కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుని, దాని గొలుసు విచ్ఛిన్నం చేయడానికి పంజాబ్ ప్రభుత్వం ముందుగానే మేల్కొని, ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ‘’ కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 308 మంది అక్కడ వైరస్ బారినపడగా.. వీరిలో 58 మందిని సూపర్ స్ప్రెడర్స్‌గా గుర్తించారు. వీరిని గుర్తించి ఐసోలేషన్‌లోకి తరలించేలోపు పలువురికి వైరస్ సోకింది. ఇలా వారి నుంచి వైరస్ సంక్రమించిన వ్యక్తుల ద్వారా మరి కొందరికి మహమ్మారి వ్యాపించింది. కొందరి నుంచి వైరస్ పదుల సంఖ్యలో వ్యాపించింది. దీంతో వైరస్ నియంత్రణ ప్రక్రియ అధికారుల మరింత కష్టంగా మారింది.

పంజాబ్‌లోని మొత్తం కేసులో సగానికిపైగా గత రెండు వారాల నుంచి నమోదయినవే, చాలా కేసులు సూపర్‌ స్ప్రెడర్స్‌తో సంబంధం ఉన్నవేనని అధికారులు గుర్తించారు. ఉదాహరణకు మొహాలీ జిల్లా జవహర్‌పూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి నుంచి 37 మందికి వైరస్ సోకింది. వీరిలో కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగువారు ఉన్నారు. తబ్లీగ్ జమాత్ సభ్యుడి నుంచి ఇతడికి వైరస్ సోకింది.

నవన్‌షహర్ జిల్లాలోనూ ఇలాగే జరిగింది. పంజాబ్‌లో తొలి కరోనా మరణం ఇక్కడే చోటుచేసుకోకుండా.. విదేశాల నుంచి అతడి ద్వారా 27 మంది సంక్రమించింది. వీరిలో కుటుంబసభ్యులు, జలంధర్ కేంద్రంగా పనిచేసే ఓ ప్రాంతీయ పత్రికలోని 17 మందికి కూడా వైరస్ రావడానికి ఇతడే కారణం. పాటియాలా జిల్లాలోని రాజ్‌పుర ప్రాంతంలో హుక్కా పార్టీకి హాజరైన18 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పఠాన్‌కోట్‌లో పుస్తకాల దుకాణం వ్యాపారి నుంచి 15 మందికి వైరస్ వ్యాపించింది. మరింత మందికి వైరస్ వ్యాపించకుండా పలు ప్రాంతాలను సీల్ చేసిన అధికారులు.. భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

జవహర్‌పూర్‌లో వైరస్ కేసు నిర్ధారణ అయిన గ్రామంలో 200 మందికి పరీక్షలు నిర్వహించగా.. 37 మందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్దారణ అయిన కేసుల్లో పెద్ద సంఖ్యలో కొన్ని ప్రత్యేకమైన క్లస్టర్స్‌లోనే ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీన్ సింగ్ సింధ్ అన్నారు.

వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసే చర్యలు ప్రభుత్వం ముందుగానే ప్రారంభించి, పరీక్షలను వేగవంతం చేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పంజాబ్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ నవ్‌జోత్ దాహియా అన్నారు. ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చిందని, వైరస్ బారినపడినవారిని ఇతరులకు వ్యాపించడానికి ముందు గుర్తించారని అన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల్లో చాలా మందికి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని, దీని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్‌లోని నమోదయిన మొత్తం కేసుల్లో 73 శాతం మందిలో ఎలాంటి అనుమానిత లక్షణాలు బయపటలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here