తెలంగాణలో మంటగలిసిన మానవత్వం.. భూతగాదాలతో వ్యక్తిని కిరాతకంగా కొట్టి

తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ముగ్గురు కలిసి విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. దీనికి సంబంధించి వీడియో బయటకు రావడంతో అందరూ షాకవుతున్నారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఏళ్లరం అనే గ్రామానికి చెందిన సబ్బని శంకర్‌, బోయి లక్ష్మి కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఇది కాస్తా వ్యక్తిగత కక్షగా మారింది.

Also Read:

దీంతో రెండ్రోజుల క్రితం లక్ష్మి కుమారులు తిరుపతి, అశోక్, కుమార్ కలిసి శంకర్‌పై దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అందరూ చూస్తుండగానే కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన చూసిన వారెవరూ శంకర్‌ను రక్షించే ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉండిపోయారు. తీవ్రరక్తస్రావంతో పడివున్న శంకర్‌ను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

శంకర్ కొడుకు ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఇలాంటి ఘటనలు చూస్తూ మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందనిపిస్తోందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సాటి మనిషిని ఇష్టం వచ్చినట్లు ముగ్గురు కొట్టడం, అది చూసి కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు ఎవరు పాల్పడినా సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here