మళ్ళీ నవ్వుల పాలు అయిన నారా లోకేష్ .. బీకాం ఫిజిక్స్ కంటే దారుణం

తన ప్రసంగాలలో తడబడుతూ నిత్యం నవ్వుల పాలు అవుతూ ఉండే నారా లోకేష్ ఇప్పుడు మళ్ళీ మరొకసారి తడబడ్డారు. అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన ని వైజాగ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు, ఈ ప్రోగ్రాం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ని ఒక దేశంగా మాట్లాడారు. ప్రసంగం మధ్యలో ఏపీ ని కంపెనీ అంటూ కంట్రీ అంటూ మాట్లాడిన ఆయన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. తప్పు మాట్లాడినా కూడా కరక్ట్ చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదు అన్నట్టు ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఇదివరకు కూడా బహిరంగ వేదికల మీద లోకేష్ కొన్ని సార్లు తడబడినా కూడా ఇంకా ఆయన ప్రవర్తన మర్చికోకపోవడం తో అనేక విమర్శలు వస్తున్నాయి. మొన్నామధ్య కూడా 175 అసంబ్లీ సీట్లు ఉన్న ఏపీ లో 200 అసంబ్లీ సీట్లు వస్తాయి అంటూ ఆయన చెప్పడం గమనార్హం. బీకాం ఫిజిక్స్ కంటే పెద్ద తప్పిదంగా దీని గురించి చెబుతున్నారు ఇప్పుడు అందరూ .. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here