జగన్ వచ్చేలోగా టీడీపీ లోకి వైకాపా లీడర్ జంప్? సర్వం సిద్దం ?

అనంతపురం వైకాపా నేతల మధ్యన ఆధిపత్య పోరు రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పార్టీ యొక్క కీలక నేత మాజీ ఎమ్మెల్యే బోడుమల్లి గురనాథ రెడ్డి టీడీపీ కి జేరుతున్నారు అని మన వెబ్సైటు కి అందుతున్న విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే పార్టీ మారడం తప్ప ఇంకేం ఛాన్స్ లేదు అని ఫీల్ అవుతున్నారట ఆయన .తన సన్నిహితులతో ఇప్పటికే టీడీపీ వైపు సంప్రదింపులు జరుపుతూ తాను టీడీపీ లోకి రావాలి అంటే గనక తన డిమాండ్ లు ఏంటి అనేవి చెబుతున్నారట రెడ్డి. అనంతపురం వైకాపా లో సీరియస్ పోరులు జరుగుతున్నాయి, అంతర్యుద్ధం లో భాగంగా వైకాపా లో అనేక తలనొప్పులు మొదలు అయ్యాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్  వైకాపా లో ఇదే ప్రాంతం నుంచి చాలా మంది ఉన్నారు. మాజీ ఎంపీ అనంత అసంబ్లీ టికెట్ ని ఆశిస్తున్నారు, సమన్వయ కర్త గా తనని వదిలి నదీం కి బాధ్యతలు అప్పజెప్పడం గురునాథ రెడ్డి కి కోపం తెప్పించిన ప్రధాన అంశం. జగన్ లండన్ నుంచి వెచ్చేలోగా ఇది జరగాలి అని చూస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here