ఫ్రెండ్ ని ప్రేమించాడు , ఒప్పుకోలేదు అని గొంతు కోసి ..

హైదరాబాద్ నగరం లో ఎక్కడా కూడా క్రైమ్ లేదు లేదు అంటి చెబుతున్న పోలీసులకి అతిపెద్ద షాక్ ఇస్తూ అడపా దడపా మర్డర్ లూ రేప్ లాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మదీనాగూడా కి సంబందించిన ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి కేసు సంచలనం అయ్యింది. మదీనగూడా లో ఉండే ఇంటర్ అమ్మాయి చాందినీ జైన్ గత ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ తో పార్టీ కోసం అంటూ బయటకి వెళ్ళింది. ఆ తరవాత ఆమె సెల్ ఫోన్ కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. తల్లితండ్రులు కంగారు పడి పోలీసుల దగ్గరకి చేరుకోగానే , పోలీసులు ఆమె ఫోన్ ని ట్రాక్ చేసారు. కానీ సమాచారం లేదు , ఇలోగా ఆమె శవం అమీనాపూర్ కొండల్లో దొరికింది. ఆమెతో పాటు ఉంటూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్ అయిన ఒక కుర్రాడు రీసెంట్ గా ఆ అమ్మాయికి ప్రొపోజ్ చేసాడు అనీ ఆమె అతని ప్రేమని రిజెక్ట్ చేసింది అనీ, వారిద్దరి మధ్యనా ఈ అంశం మీద గొడవ కూడా జరిగింది అనీ చెబుతున్నారు. అతనినే పోలీసులు ప్రధమ ముద్దాయి గా అనుమానిస్తున్నారు. అతను పరారీ లో ఉన్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here