..ఎంట్రెన్స్ ప‌రీక్ష రాసేట‌పుడు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే..

క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయిన‌ప్ప‌టికీ అన్‌లాక్ 4 కొన‌సాగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పటికే విద్యార్థులు స్కూల్స్‌, కాలేజీల‌కు దూర‌మ‌య్యారు. ప‌లు విద్యాసంస్థ‌లు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే కేంద్రం తాజాగా ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విశ్వ‌విద్యాల‌యాలు, కాలేజీలు, స్కూల్స్ యాజ‌మాన్యాలు స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. త్వ‌ర‌లో జేఈఈ, జేఈఈ అడ్వాన్స్‌డు పరీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ప‌రీక్ష‌ల‌కు రాసే అవ‌కాశం ఉంది.

క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఎవ‌రైనా ప‌రీక్ష కేంద్రాల‌కే వ‌స్తే వారిని వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి పంపేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో తెలిపింది. కేవ‌లం కోవిడ్ లక్ష‌ణాలు లేని వారిని మాత్రమే ప‌రీక్ష కేంద్రాల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని పేర్కొంది. ఇక పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని నిబంధ‌న‌ల్లో తెలిపింది. క‌రోనా లక్ష‌ణాల‌తో ప‌రీక్ష కేంద్రాల‌కు వ‌చ్చే వారికి మ‌రో తేదీని నిర్ణ‌యించాల‌ని, లేదంటే కేంద్ర నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి మ‌రో మార్గం ద్వారా రాసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here