కావాల‌నే అడ్డు త‌గులుతున్నారు.. వై.ఎస్ జ‌గ‌న్‌

రాష్ట్రంలో ప్ర‌జా సంక్షేమ‌మే లక్ష్యంగా ముందుకు వెళుతుంటే కావాల‌నే కొంద‌రు అడ్డు త‌గులుతున్నార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించారు.

ఏప్రిల్ 11, 2019 నాటికి పొదుపు సంఘాలకు ఉన్న రుణాల‌ను నాలుగు ద‌ఫాల్లో చెల్లించ‌నున్నారు. మొద‌టి విడ‌త‌లో భాగంగా 6.792 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ఎన్నిక‌ల స‌మ‌యానికి  ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని అప్పుడు హామీ ఇచ్చాన‌ని తెలిపారు. మాట త‌ప్ప‌కుండా ఇప్పుడు అప్పులు చెల్లిస్తున్న‌ట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఇళ్ల ప‌ట్టాల విష‌యంలో అడుగ‌డుగునా అడ్డు త‌గులుతున్న వైనాన్ని సీఎం గుర్తు చేశారు.
30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. కానీ కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారన్నారు. అయిన‌ప్ప‌టికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు. ఇక‌ మద్యాన్ని నియంత్రించేందుకు 43వేల బెల్ట్‌షాపులు తొలగించామని జ‌గ‌న్ తెలిపారు.  4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశామ‌ని, 33శాతం మద్యం షాపులు తగ్గించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here