నిహారిక ఇకపై సినిమాల్లో నటించదా..?

చాలామంది నటీమణులు వివాహం తర్వాత తమ సినీ కెరీర్ కు ముగింపు పలికి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మెగా డాటర్ నిహారిక కూడా చేరనుందా..? అంటే.. పరిణామాలు చూస్తుంటే అవుననిపిస్తున్నాయి.
తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన నిహారిక కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు… స్వాతిని దర్శకత్వంలో అశోక్ సెల్వన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది. నిహారిక కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంది. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు నిహారిక చిత్ర యూనిట్ కు తెలిపింది… దీంతో సదరు చిత్ర యూనిట్ నిహారిక స్థానాన్ని మరో నటి మేఘ ఆకాష్ తో రీ ప్లేస్ చేశారు. నిశ్చితార్థానికి ముందు వరకూ సినిమాలో నటించిన నిహారిక… ఆ తర్వాత చిత్రం నుంచి తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారణంగానే నిహారిక భవిష్యత్తులో సినిమాల్లో నటించదనే అనుమానం బలపడుతోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నిహారిక ఇప్పట్లాగే సినిమాల్లో నటిస్తుందా… లేదా నిర్మాతగా మారుతుందో.. వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here